విద్యాలయాల్లోనే ఆధార్ సేవలు
మహబూబాబాద్, జులై 19 (విజయక్రాంతి): విద్యార్థులకు ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉచితంగా ఆధార్ నమోదు, అప్డేట్ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని విద్యార్థుల ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహం, సమన్వ యంతో బాట్రానిక్స్ సంస్థతో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉచిత ఆధార్ సేవల ను అందిస్తున్నారు. చిన్నతనంలో తీసిన ఆ ధార్ కార్డుల్లో ప్రస్తుతం వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు సరిపోలక విద్యార్థులు అ నేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్కాలర్షిప్లు, ప్రవేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ వివరాలు సక్రమంగా ఉండటం తప్పనిసరి కావడంతో వి ద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని వి స్తృతంగా ప్రోత్సహిస్తూ పాఠశాలల ద్వారా అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో మొత్తం 45 ఆధార్ కిట్లను కే టాయించారు. ప్రత్యేక శిక్షణ పొందిన సి బ్బంది పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఫోటో లు తీసి, కంటి ఐరిస్, వేలిముద్రల స్కానింగ్ నిర్వహించి ఆధార్ వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ప్రతి బృందం రోజుకు 20 నుంచి 30 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోం ది. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్ర కారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను సందర్శిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇకపై మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే ఉచితంగా ఆధార్ నమోదు, అప్డేట్ సేవలను పొందుతున్నారు. దీంతో సమయం, ప్రయాణ ఖర్చు ఆదా కావడం తో పాటు ఆధార్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయని అధి కారులు తెలిపారు. విద్యాశాఖ అధికారుల చొరవ, ప్రోత్సాహంతో పాఠశాలలకే ఆధార్ సేవలు చేరుకోవడంతో విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోంది.






