18 July, 2026 | 11:04 AM

ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు

15-12-2024 12:47 AM

ఆరు నెలలు పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్  చేసుకునేందుకు కేంద్రం మరోసారి అవకాశం ఇచ్చిం ది. డిసెంబర్ 14తో ముగిసిన గడువును 2025 జూన్ వరకు పెంచింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా యూఐడీఏఐ సంస్థ వెల్లడించింది. దీంతో పుట్టినతేదీ, అడ్రస్, ఫోన్ నంబర్ తదితర మార్పులు చేసుకునే వారికి మరో అవకాశం లభించిం ది.

ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆధార్‌లో వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం  సంబంధిత పత్రాలను  సమర్పించి ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మార్పు లు చేసుకోవచ్చు. గడువు ముగిశాక గతంలో లాగానే రూ.50 చెల్లించి ఆధార్ కేంద్రాల్లో ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చని  పేర్కొన్నది.