18 July, 2026 | 10:39 AM

సంభల్‌లో బయటపడ్డ శివాలయం

15-12-2024 12:42 AM

ఆలయాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం

గుర్తించిన పోలీసులు

సంభల్, డిసెంబర్ 14:  ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో ఎవరూ ఊహించిన విధంగా శివాలయం బయటపడింది. గత కొన్ని రోజులుగా పట్టణంలో హింస నెలకొని తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడడంతో జామా మసీదు ఏరియాలో ఆక్రమణలను పోలీసులు, అధికారులు తొలగిస్తున్నారు. దుండగులను పట్టుకోవడానికి పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో  పోలీసులు  తనిఖీలు నిర్వహిం చగా 46 ఏళ్ల నాటి  శివాలయం బయటపడింది.

ఈ కట్టడాన్ని 1978వ సంవ త్సరానికి చెందినదిగా భావిస్తున్నారు. గుడిలో హనుమంతుడు, శివలింగం, నంది విగ్రహాలు లభించాయి. దీంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే అక్కడ శివాలయం ఉన్న విషయాన్ని స్థానికులు కొందరు ఇన్నాళ్లు దాచిపెట్టారు. కాగా ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమన్ బుర్కే ఇంటికి 200 మీటర్ల దూరంలోనే శివాలయం బయడపడడం గమనార్హం.