calender_icon.png 11 August, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడబిడ్డలందరికీ అండగా ఆమ్ ఆద్మీ పార్టీ

10-08-2025 01:37:40 AM

ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి):  ఆడబిడ్డలు అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని,  మీ హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడటానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉంద ని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, మాజీ అధ్యక్షు డు బుర్ర రాములు గౌడ్ అన్నారు. ఈ మేరకు శనివారం లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయం లో  రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు ఆధ్వర్యంలో  రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలందరికీ   రూ.2500 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.  కాలేజీకి వెళ్లే ప్రతి ఆడబిడ్డకు స్కూటీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పభుత్వం తొందరగా ఆడబిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్చార్జి అహషన్ అబ్బాస్, కో- ఇంచార్జ్ సోహెల్ ఖాన్, నాయకులు శివా జీ, కొడంగల్ శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, ధర్మేందర్ తీవారీ, లియాకత్ ఖాన్, మౌనిక, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.