calender_icon.png 11 August, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నా చెల్లెళ్ల అప్యాయతలకు నిదర్శనం

10-08-2025 01:35:46 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్‌కుమార్ 

ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): అన్నా చెల్లెళ్ళ అనుబంధం అప్యాయతలకు నిదర్శనం రక్షా బంధన్ గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్‌కుమార్ అన్నారు. రాఖి పండుగ సందర్భంగా ఆమె శనివారం గాంధీనగర్  డివిజన్‌లోని పలువురు సోదర సమానులైన బీజేపీ నేతలకు రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మైనారిటీ మోర్చ నాయకుడు మహమ్మద్ మహమూద్ ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం. ఉమేష్, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జయ్ రామ్ రెడ్డి రాఖి కట్టారు.

నీవు నాకు రక్షా...నేను నీకు రక్షా... మనం దేశానికి రక్షా.! అందుకు ఈ రాఖీ నిదర్శనమ న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్‌కు మార్, బీజేపీ నాయకులు నర్సింహ, ఆనంద్ రావు, ప్రశాంత్ తదితరులు  పాల్గొన్నారు.