calender_icon.png 10 August, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెక్‌హబ్ భాగ్యనగరం

10-08-2025 01:37:45 AM

-సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో తెలంగాణ

-యూనికార్న్ స్థాయి దిశగా కంపెనీలు సాగాలి

-ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సర్వీస్ ఆధారిత కంపెనీలను నడపటం తేలిక, కానీ ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలు అధికంగా సవాళ్లను ఎదుర్కొంటాయని, ఈ క్రమంలో హైద రాబాద్‌కు టెక్‌హబ్‌గా గుర్తింపు రావడం ప్రశంసనీయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఎగుమతుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈయాప్సిస్ కంపెనీకి చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను శనివా రం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంపెనీలు యూనికార్న్ స్థాయిని సాధించే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కృత్రిమ మేధస్సు సాంకేతికత, పరిపాలనపై వేగంగా చూపుతున్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ, విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను అందించే ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటిం చారు. గతంలో హైదరాబాద్‌లో మూడు మాత్రమే యూనికార్న్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 30 పెరిగిందని, 400 సీట్లు ఉన్న ఈ కొత్త కార్యా లయ సామర్థ్యం భవిష్యత్తులో 4 రెట్లు పెరిగి రాష్ర్టం, నగరానికి మరింత గుర్తింపును తెస్తోందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ఈయాప్సిప్ సంస్థ విస్తరణతో హైదరాబాద్ ప్రపంచ సాంకేతిక, ఇన్నోవేషన్ కేంద్రంగా మరింత బలపడిందన్నారు. యూకే ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ గ్లోబల్ ఒరాకిల్ భాగస్వామి, ఐటీ సేవల సంస్థ, హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 200 మంది సిబ్బందిని వచ్చే రెండు సంవత్సరాల్లో 500కు పైగా పెంచాలని ప్రణాళికలు ప్రకటించింది.

ఈ విస్తరణలో భాగంగా అత్యాధునికంగా 400 సీట్ల సామర్థ్యంతో కూడిన కొత్త సౌకర్యాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌లో జోడించడం ద్వారా, హైదరాబా ద్‌ను ఒరాకిల్ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సర్వీసులకు వ్యూహాత్మక కేంద్రంగా మరింత బలపరిచింది. ఈ యాప్సిస్ చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సెంటర్ తమ ప్రయాణం లో ఒక పెద్ద మైలురాయి అని, ఇది తమకు గ్లోబల్ కస్టమర్లకు మరింత సమర్థవంతంగా మద్దతు ఇవ్వడమే కాకుండా, కొత్త సాంకేతికతలలో మార్పును నడిపే స్థితిని కల్పిస్తోంద న్నారు.

అధిక నాణ్యత, ప్రభావవంతమైన పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ఈ పెట్టుబడి అని స్పష్టం చేశారు. అధిక నైపుణ్యాల వర్క్‌ఫోర్స్, బలమైన మౌలిక సదుపా యాలు, డిజిటల్‌కు అనుకూల ప్రభుత్వ వి ధానాలు, చురుకైన విద్యా, స్టార్ట్‌అప్ వాతావరణం కలిసి హైదరాబాద్‌ను ఈ ఇన్నోవేష న్ హబ్‌గా మారుస్తున్నాయన్నారు.