‘ఆప్’ క్లీన్ స్వీప్
- పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా
- 8 కార్పొరేషన్లలో ఐదు కైవసం
- 78 బల్దియాల్లో సగం, ౧౯ నగర పంచాయతల్లో సగానికి పైగా సొంతం
- ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం
- స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్, అకాలీ దళ్ కంటే వెనుకంజ
చండీగడ్, మే ౩౦: పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసింది. ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, 19 నగర పంచాయతీల పరిధిలో తాజాగా ఎన్నికల ఫలితాలు విడులయ్యాయి. ఈ ఫలితాల్లో అధికార ఆప్ ఐదు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాలను కైవసం చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కో కార్పొరేషన్ పీఠం చొప్పున దక్కించుకున్నాయి. మరో కార్పొరేషన్ పరిధిలో హంగ్ ఏర్పడింది. అలాగే, 75 మున్సిపాలిటీల్లో సగానికి పైగా పీఠాలను ఆప్, 19 నగర పంచాయతీల్లో సగానికి పైగా పీఠాలనూ ఆప్‌నే సొంతం చేసుకుంది.
కాంగ్రెస్ పది స్థానాలకు పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్, బీజేపీ ఒకటిరెండు చోట్ల తప్ప పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1,977 వార్డులు ఉండగా, 950 స్థానాల వరకు (48 శాతం) ఆప్ గెలుచుకున్నది. ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సొంత నియోజకవర్గ కేంద్రం ధురీ మున్సిపాలిటీలో 21 వార్డులు ఉండగా, 19 వార్డులు ఆప్ కైవసం చేసుకుంది. అయితే.. హంగ్ ఏర్పడిన చోట ఏ పార్టీకి చైర్‌పర్సన్ పీఠాలు దక్కుతాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని బల్దియాల్లో తమ బలాన్ని నిరూపించుకునే పనిలో ప్రధాన పార్టీలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో అగ్రస్థానంలో ఆప్ నిలవగా, ౨వ స్థానంలో స్వత్రంత్ర అభ్యర్థులు నిలిచారు. ౩వ స్థానంలో కాంగ్రెస్, ౪వ స్థానంలో శిరోమణి అకాలీదళ్ నిలిచాయి. బీజేపీ ౫వ స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి ఘోరపరాజయమని చెప్పవచ్చు. మొత్తానికి ఆప్ విజయం వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద బూస్టింగ్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






