9 April, 2026 | 2:40 PM

వైభవంగా ఆరట్టు ఉత్సవం

02-12-2024 01:51 AM
  1. అయ్యప్పసామి పల్లకి మోసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
  2. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో అయ్య ప్పసామి ఆరట్టు ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిరహించారు. స్థానిక రామచంద్ర గోపాలకృష్ణ మ ఠం నుంచి ప్రారంభమైన ఉత్సవం పట్టణ పురవీధుల గుండా కొనసాగింది. మఠాధిపతి యోగానంద సర సతిసామి ఆధర్యంలో సామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణంలో ఊరేగించారు. 

శోభాయాత్రలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని సామి పల్లకిని మోశారు. అయ్యప్ప మాలధారులు, భక్తుల భజన కీర్తనలు, అయ్యప్పసామి నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. కేరళ డోలు వాయిద్యాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా రవీంద్రనగర్‌లోని ఉమామహేశర అయ్యప్ప ఆలయం నుంచి దామోదర్ గురుసామి ఆధర్యంలో  ఆరట్టు ఉత్స వాన్ని నిర్వహించారు.

ఈ  శోభాయాత్రలో మాజీ మంత్రి జోగు రా మన్న, తన సతీమణి రమాదేవితో కలిసి అయ్యప్ప పల్లకికి ప్రత్యేక పూజ లు చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఖత్రి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గొన్నారు.