9 April, 2026 | 4:35 PM

ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే బీఆర్‌ఎస్ కుట్ర

02-12-2024 01:52 AM

హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కుట్రకు బీఆర్‌ఎస్ నాయకులు తెర లేపారని టీపీసీసీ అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శిం చారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలకు సెక్రటరీగా ఉన్న సమయం లో హాస్టళ్లలో ఫుడ్ కాంట్రాక్టర్లను, వర్కర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించిన వారే ఇప్పటికీ కొనసాగుతు న్నారని పేర్కొన్నారు.

వారిని ఆసరాగా చేసుకొని వసతి గృహాల్లోని పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకు ప్రాముఖ్యతనిస్తూ, సంక్షేమ హాస్టళ్లలో డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచడంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రభుత్వంపైన విశ్వతనీయత పెరగడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి, ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు తినే అన్నంపై రాజకీయం చేయడం సరికాదని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని బయటకు తీయడంతోపాటు గురుకులాల్లో జరిగిన ఘటనలపై దర్యాప్తు పూర్తయిన వెంటనే బాధ్యులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.