calender_icon.png 16 October, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్ కలాం జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం

16-10-2025 12:08:09 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, అక్టోబర్ 15 : అత్యంత సామాన్య కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో మిస్త్స్రల్ మెన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో  ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.  నేటితరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు.

ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలను తరిమికొట్టాల్సిన గురుదర బాధ్యత విద్యార్థి లోకంపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్,  పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులుపాల్గొన్నారు. 

నివాళి అర్పించిన ఎండిఆర్      ప్రిథ్వీరాజ్

పటాన్ చెరు, అక్టోబర్ 15 ః దేశభక్తి, విజ్ఞానం, వినమ్రతకు ప్రతీక అయిన భారతరత్న డాక్టర్ ఏ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్  పాల్గొని డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ కలాం కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదని, ఆయన దూరదృష్టి కలిగిన నాయకుడన్నారు. స్వప్నాలు కనండి, వాటిని సాధించడానికి కృషి చేయండి అని ఆయన చెప్పిన మాటలు ఈరోజు కూడా ప్రతి భారత యువకుడి హృదయంలో మార్మోగుతున్నాయని తెలిపారు. ఆయన చూపిన మార్గం మనందరికీ శాశ్వత ప్రేరణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సామాజిక సేవకులు పాల్గొని డాక్టర్ కలాం  సేవలను స్మరించారు. కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.