16-10-2025 12:10:49 AM
జహీరాబాద్ టౌన్, అక్టోబర్ 15 : అప్పు గా తీసుకున్న వ్యక్తి డబ్బులను తిరిగి ఇవ్వననడంతో అప్పు ఇచ్చిన మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని అల్లిపూర్ లో చోటు చేసుకుంది. జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం షేరి నగర్ అల్లీపూర్ లో నివాసం ఉంటున్న కొత్త గొల్ల స్వప్న(34) గుర్జువాడకు చెందిన శంకర్ అనే వ్యక్తికి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చింది.
కొద్ది రోజుల తర్వాత స్వప్న శంకర్ ను డబ్బులు అడగగా ఇవ్వనని ఖరాకండిగా చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయినట్లు తెలిపారు. స్వప్న భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ వినయ్కుమార్ తెలిపారు.