17-07-2024 12:25:34 AM
షారుక్ ఖాన్ కథానాయకుడిగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. ‘కింగ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ప్రతినాయకుడిగా నటించనున్నారట! ఈ విషయాన్ని స్వయానా అమితాబ్ బచ్చన్ ప్రకటించటంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, అందులో షారుక్, ఆయన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.
ఈ మూవీలో విలన్ రోల్ సరికొత్తగా ఉండబోతోందనేది బాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్. ఈ పాత్రలో నటించాల్సిందిగా డైరెక్టర్ సుజోయ్ ఘోష్ అభిషేక్ బచ్చన్‌ను సంప్రదిస్తే మొదట విముఖత వ్యక్తం చేశారట ఆయన. తర్వాత పాత్రలోని డెప్త్, ప్రత్యేకత నచ్చడంతో ఓకే చెప్పారనేది బాలీవుడ్ వర్గాలు చెప్తున్న సమాచారం. తాజాగా, షారుక్‌తో అభిషేక్ విలన్‌గా తలపడనున్నారంటూ ఎక్స్‌లో వచ్చిన ఓ క్యాప్షన్‌ను ట్యాగ్ చేస్తూ అమితాబ్ బచ్చన్ ‘ఆల్ ది బెస్ట్ అభిషేక్. ఇట్ ఈజ్ టైమ్’ అని పేర్కొన్నారు. బిగ్ బీ క్లారిటీ ఇచ్చిన తర్వాత బచ్చన్ అభిమానుల్లో ఆనందం ఉరకలు వేస్తోంది.