17-07-2024 12:22:38 AM
కథానాయకుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయన్’. 50వ చిత్రంగా ధనుష్ నటించిన ఈ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. “అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి” అనే పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేపుతుండగా.. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, ప్రకాశ్ రాజ్ వంటి తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మితమైన ఈ సినిమాని ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగు వారి ముందుకు తీసుకొస్తుంది.