17 June, 2026 | 2:18 AM

ఆసుపత్రిలో చేరిన పి. సుశీల

18-08-2024 10:23 AM

హైదరాబాద్: ప్రముఖ గాయని పి. సుశీలకు అస్వస్థతకు గురయ్యారు. 86 ఏళ్ల ఆమె కడుపు నొప్పి కారణంగా చెన్నెైలోని కావేరి ఆస్పత్రిలో సుశీల చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా సుశీల అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుశీల ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుశీల పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.