టాప్ 2లోకి అభిషేక్ శర్మ

17-09-2026 | 05:15am
  1. ఇషాన్ అగ్రస్థానంపై గురి
  2. ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ 

దుబాయి, సెప్టెంబర్ 16 : టీమిండియా(Team India) విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌(ICC T20 Rankings)లో దు మ్మురేపాడు. తాజా జాబితాలో టాప్ 2 లోకి దూసు కొచ్చాడు. అఫ్గాస్థాన్‌(Afghanistan)తో టీ 20 సిరీస్‌లో అదరగొట్టడం తో అతని ర్యాంకింగ్ మెరుగైంది. ఈ క్రమంలో పాకిస్థా న్ బ్యాటర్ షాహిబ్జాద ఫర్హా న్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు. తొలి రెండు మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 82, 39 పరుగులతో రాణించాడు. దాంతో ఈ సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

ఈ ప్రదర్శనతో అ భిషేక్ శర్మ.. ఒక స్థానం ఎగబాకి ఇషాన్ కిష న్ అగ్రస్థానానికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం 51 రేటింగ్ పా యింట్స్ మాత్రమే. గతంలో అభిషేక్ శర్మ టాప్ ర్యాంకులో కొనసాగగా.. ఇషాన్ కిషన్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో టా ప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఆఖరి టీ20లో అభిషేక్ చెలరేగితే తిరిగి టాప్ ర్యాంక్ అందుకునే అవకాశం ఉంది. రెండో టీ20లో హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్న సంజూ శాంసన్(57).. నా లుగు స్థానాలు ఎగబాకి 30వ స్థానంలో నిలిచాడు.

ఈ సిరీస్‌లో బ్యాటింగ్ అవకాశం రాని తిలక్ వర్మ(Tilak Varma) ఒక స్థానం దిగజారి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తీ ౨ స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచా డు. బుమ్రా ఏకంగా 7 స్థానాలు ఎగబాకి టాప్-10 ర్యాంక్ అందుకోగా.. అర్షదీప్ సింగ్ 11 స్థానాలు మెరుగుపర్చుకొని 14వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల ర్యాంకుల్లో హార్దిక్ పాండ్యా రెండు స్థానాలు దిగజారగా.. శివమ్ దూబే 3 స్థానాలు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు