1 July, 2026 | 11:10 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వైభవంగా శివాలయాల్లో శివుడికి అభిషేకాలు..

07-12-2025 06:15 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి శివాలయంలో, అలాగే పాతవాడలో గల శివాలయంలో, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ సాంబశివ దేవాలయంతో పాటు పలు దేవాలయాల్లో ఆదివారం ఉదయం(భానువారం) మార్గశిర బహుళ తదియ ఆర్ద్ర నక్షత్రం... (మహాశివుని జన్మ నక్షత్రం) పురస్కరించుకొని శివునికి రుద్రాభిషేకం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండువగ నిర్వహించడం జరిగింది.

అనంతరం గుడి మిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివుడికి అన్న పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాతవాడలోని శివాలయంలో చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిషేకంతో పాటు.. శివుడి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివాలయాల్లో పూజారులు పోలస అశోక్, వల్లకొండ మఠం మహేష్, పారువెల్ల రమేష్ శర్మలు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.