calender_icon.png 8 December, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బీజేపీలో చేరిక

07-12-2025 06:17:07 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి వరలక్ష్మి, 8 మంది వార్డు మెంబర్ సభ్యులతో కలసి ఆదివారం భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ గతం గుడెన్ఘాట్, తుంపల్లి గ్రామాలలో చాలా అభివృధి పనులు చేపట్టామని అన్నారు.

గ్రామాలు అభివృధి చెందాలంటే భాజపాతోనే సాధ్యం అవుతుందని అన్నారు. గ్రామాల అభివృధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి చేపడుతున్న పనులకు ఆకర్షితులై గ్రామస్థాయి కార్యకర్తలు భాజపాలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేకల దత్తు, టెకం రాము, కౌసల్య, అంబ రావు, తదితరులు పాల్గొన్నారు.