07-12-2025 05:09:00 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం కన్నెపల్లిలో పోలీసులు కవాతు నిర్వహించారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ గ్రామ పంచాయతీలు నాయకంపేట వీగాం, కన్నేపల్లి గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రాబోవు గ్రామపంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. అనవసరమైన గొడవల జోలికి వెళ్లి కేసుల్లో ఇరుక్కు పోకూడదన్నారు.
ఎలక్షన్ లో కేసులైనట్లయితే భవిష్యత్తులో ఉద్యోగం అవకాశాలు కోల్పోతారని తెలిపారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎన్నికలకు విఘాతం కరిగించేందుకు ఎవరైనా అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వెల్లడించారు. పోలీస్ ఫ్లాగ్ మార్చ్ లో కన్నెపల్లి ఎస్ఐ కే భాస్కర్రావు, తాండూరు సర్కిల్ పరిధిలోని తాండూరు, మాదారం, కన్నెపల్లి, బీమినీ పోలిస్టేషన్ పరిధిలోని అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.