3 May, 2026 | 2:06 AM

అమెరికా ప్రమేయం వద్దే వద్దు!

03-05-2026 12:51 AM
  1. స్వేచ్ఛా స్వాతంత్య్రాలే మా లక్ష్యం
  2. పశ్చిమాసియాలో శాంతిస్థాపనపై ఇరాన్ ప్రకటన
  3. సముద్ర దొంగలమవుతాం: ట్రంప్

టెహ్రాన్, మే ౨: పశ్చిమాసియాపై అమెరికా ప్రమేయం ఉంకూడదనేది తమ అభిమతమని, స్వేచ్ఛా సాతంత్య్రాలే లక్ష్యమని ఇరాన్ ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన విడుద ల చేసింది. మధ్యప్రాచ్యంపై అమెరికా జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. హోర్ము జ్ జలసంధిపై శాశ్వతంగా ఇరాన్ ఆధిపత్యమే ఉంటుందని, ఈ విషయంలో తాము ఎవరితోనూ చర్చలు పెట్టబోమని తేల్చిచెప్పింది. ఈ  పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తనదైన శైలిలో స్పతించారు.

ఇరాన్ నాయకత్వంలోనే ఎన్నో విభేదాలు ఉన్నాయ ని ఎద్దేవా చేశారు. ఇక తాము ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకుంటామని, చమురు నిల్వలను కొల్లగొడతామని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా.. అమెరికన్ సైన్యం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తారని చమత్కరించారు.ఇరాన్‌లోని ఓడరేవులపై తమ దిగ్బంధం కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే తమ సైన్యం అనేక ఇరాన్ నౌకలను దారి మళ్లించాయని వివరించారు.