calender_icon.png 10 November, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య కోసం కృషి చేసిన వ్యక్తి అబుల్ కలాం

10-11-2025 12:00:00 AM

డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్

ఆదిలాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి) : స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మ ద్, అని అబుల్ కలాం అనేది ఆయన బిరు దు, ఆజాద్ అనేది కలం పేరు అని తెలిపా రు. నవంబర్ 11న అజాద్ జయంతి సందర్భంగా భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ వస్తోందన్నారు.

ఆయన జయంతినీ  పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బాలక్ మంది ర్ ఉన్నత పాఠశాలలో జావా, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ, బేస్ స్వచ్ఛంద సంస్థ ల ఆధ్వర్యంలో  వివిధ పాఠశాలల విద్యార్థులకు అబుల్ కలాం అజాద్ ప్రాముఖ్యత గురించి నిర్వహించిన వ్యాస రచన పోటీలలో సాజిద్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఉర్దూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను, కవులను సన్మానించారు.

అనంతరం సాజిద్ ఖాన్ మాట్లాడుతూ అబుల్ కలాం అజాద్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీ కరించి, విద్యా వ్యవస్థ పటిష్టతకు ఎంతో కృ షి చేశారని పేర్కొన్నారు. దేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని, విద్య  ప్రాముఖ్యత కొరకు ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమం ఆయా సొసైటీ సభ్యులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.