09-11-2025 10:58:44 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా ఉస్మానియా బిస్కెట్లు, దమ్-కే-రోట్ వంటి స్పెషల్ రుచులకు పేరు పొందిన సుభాన్ బేకరీ నగరంలో తమ కొత్త బేకరీ, కేఫ్ను రసూల్ బీ సాహిబాతో కలసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించినట్లు సుభాన్ బేకరీ ఎండీ సయ్యద్ ఇర్ఫాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ నూతన బ్రాంచ్ ద్వారా తమ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ లుక్మాన్ తదితరులు పాల్గొన్నారు.