10-11-2025 12:00:00 AM
మంచిర్యాల, నవంబర్ 9 (విజయక్రాంతి) : బెల్లంపల్లి జిల్లా పరిషత్ గరల్స్ హై స్కూల్ లో చదివిన 1975 నుంచి 1988 వరకు ఎస్‌ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆనందోత్సహాలతో గడిపారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులు, ప్రధానోపాధ్యాయులు కస్తూరి దేవ రాజ్, డైనా, కళావతి, సరోజ లక్ష్మి, కమల కుమారి, స్వర్ణలత, కాంతయ్య, రాజయ్య, రామ్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ప్రేమ్ సాగర్ లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు భాగ్యలక్ష్మి, జయశీల, వంగల సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14 బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.