గీతాంజలికి అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు లు
సాధించిన విద్యార్థులు ఖమ్మం, ఏప్రిల్ 13(విజయక్రాంతి):
ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌లోని గీ తాంజలి పాఠశాల విద్యార్థులు అక డమిక్ ఎక్సలెంట్ అవార్డులు సాధించారు. ఆల్ ఇండియా మైచాంప్స్ టాలెంట్ టెస్ట్‌లో నిహాస్ సాయి ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించాడు. సుచిరిండియా ఫౌండేషన్ వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సీవీ రా మన్ స్టేట్ లెవల్ టాలెంట్ టెస్ట్‌లో రాష్ట్రస్థాయి 2వ ర్యాంకును ఎం నైనిష, వీ.నిహాస్ సాయి, పి.నవదీప్‌లు రాష్ట్రస్థాయి 4వ ర్యాం కును, వై.కార్తికేయ రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు సాధించారు.
అలాగే మెంటార్స్ ఐఐటీ అకాడమీ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మెడల్స్, ప్రశంసాపత్రాలు స్వీకరించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాఠవాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
అలాగే పాఠశాల స్థాయిలో వివిధ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డెరెక్టర్లు టి.పద్మ, టి.అరుణ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




