ఉస్మానియా వర్సిటీ బిల్డింగ్ డివిజన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
16-12-2025 03:14 PM
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ బిల్డింగ్ డివిజన్ ఆఫీస్ లో అవినీతి నిరోధక బ్యూరో(Anti-Corruption Bureau) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఉస్మానియా వర్సిటీ బిల్డింగ్స్ డివిజన్ లో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బిల్లుల మంజూరుకు గుత్తేదారును రూ.11 వేలు డిమాండ్ చేయడంతో గతంలో డీఈఈకి రూ.6 వేలు ఆన్ లైన్ లో పంపించాడు. డీఈఈకి మరో రూ.5 వేలు ఇచ్చేందుకు బాధితునితో లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తూ ప్రణాళిక ప్రకారం డీఈఈకి బాధితుడు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.




