16-12-2025 02:51:59 PM
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. నిర్మల సీతారామన్ కు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం యంగ్ ఇండియా స్కూళ్ల ఖర్చులను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా స్కూళ్ల ప్రాజెక్టు డీపీఆర్ పంపాలని మంత్రి నిర్మల చెప్పడంతో డీపీఆర్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థికమంత్రికి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రికి తెలిపారు.