ఏసీబీకి చిక్కిన రాయికల్ ఎస్సై అజయ్
22-06-2024 11:48 AM
రాయికల్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఎస్ఐ అజయ్ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిని రూ. 25000 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఇసుక వ్యాపారి మధ్యవర్తి ద్వారా డబ్బులు పంపించాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ అజయ్ పరారయ్యాడు. ఎస్ఐ అజయ్ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.






