తాగిన మైకంలో భర్తను హతమార్చిన భార్య
22-06-2024 01:37 PM
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: తాగిన మైకంలో భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు. కోపంతో ఆ ఇల్లాలు రోకలిబండతో కట్టుకున్న భర్తను హతమార్చింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం అనంతసాగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలకపల్లి మండలం అనంత సాగర్ గ్రామానికి చెందిన శ్రీను యాదవ్, భార్య రాములమ్మ ఇరువురు తరచూ తాగిన మైకంలో గొడవ పడుతూ ఉండేవారు. ఈ నేపద్యంలో శుక్రవారం రాత్రి కూడా ఇరువురూ గొడవపడ్డారు. భార్య రాములమ్మ కోపంతో భర్త శ్రీను యాదవ్ (48) పై రోకలిబండతో దాడి చేసింది. దీంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు.






