27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

తుంగతుర్తిలో ఏసీబీ సోదాలు

03-06-2026 11:24 AM

అడిషనల్ ఎస్పీ భుజంగరావు మామగారు రాజేశ్వరరావు ఇంటిలో సోదాలు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో హైదరాబాదులో ఇటీవల ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన నిందితులై, అక్రమాస్తులతో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు రాష్ట్ర ఏసీబీ(ACB Raids) అధికారుల ఆదేశాల మేరకు మామ రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇంటిలో ఎవరు లేరని, తాళం వేసి ఉండడంతో, దీనితో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోయామని, తదుపరి విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.