3 June, 2026 | 12:01 PM

బీజేపీ అగ్రవర్ణాల పార్టీ.!

03-06-2026 10:41 AM

దేశంలోనే మోడల్ సీఎంగా రేవంత్ రెడ్డి.

జనగణన లోనే కుల గణన పూర్తి కావాలి.

 ఎంపీ మల్లు రవి.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే దేశంలోని ఆయా రాష్ట్రాలను ప్రభావితం చేస్తూ మోడల్ రాష్ట్రంగా పేరుగాంచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మోడల్ సీఎంగా నిలిచారని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ సూచించిన విధంగా ప్రతి సామాన్యుడికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలన్న లక్ష్యంతో నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తూ సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రాజీవ్ గాంధీ ఆశయాలు సాధించాలన్న లక్ష్యంతో విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో కార్పొరేట్ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్(Young India Integrated Schools) నిర్మాణం జరుగుతుందన్నారు, ఉస్మానియా కాకతీయ  యూనివర్సిటీలో గత పదేల్ల కాలంలో కనీసం విసీల నియామకం కూడా చేపట్ట లేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం విసీలుగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు  అవకాశం కల్పించిందన్నారు. మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైద్య రంగాన్ని మెరుగుపరుస్తుందని గుర్తు చేశారు. ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. అన్ని వర్గాలకు సమాన వాటా లభించాలన్న లక్ష్యంతో కులగనన చేపట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్కు పంపగా బిజెపి ప్రభుత్వం తొక్కి పట్టిందని ప్రస్తుతం జరుగుతున్న జనగణన నేపథ్యంలోనే కుల గనన కూడా జరగాలని పేర్కొన్నారు.

అందుకు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో జరిపిన కుల గనన ప్రాతిపదిక తీసుకోవాలని చెప్పినట్లు గుర్తు చేశారు. బిజెపి ఉన్నత వర్గాలు, అగ్రవర్ణాలు, వ్యాపారులున్న పార్టీగా పేరుందిందని నిరుపేదల పట్ల బిజెపికి చిన్న చూపేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తోందని రాష్ట్రంలో ప్రజలు కడుతున్న పన్నుల ఆధారంగా కేంద్రం నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ఫ్యూచర్ సిటీ, త్రిబుల్ ఆర్, మూసి ప్రక్షాళన వంటి చేపట్టడంతోనే ఇతర ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు వస్తున్నారని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈనెల 4, 5 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.