22 May, 2026 | 2:17 PM

దాహార్ది తీర్చడమే ప్రధాన లక్ష్యం

22-05-2026 01:17 PM

మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ 

మంథని,(విజయ క్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని ప్రజలకు దాహార్ది తీర్చడమేతమ ప్రధాన లక్ష్మమని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల  శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా వాటర్ ట్యాంక్ ను శుక్రవారం శ్రీపాద కాలనీ ఏర్పాటు చేశారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని నివారించాలని మున్సిపల్ చైర్మన్ వైస్, చైర్మన్ ల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారు స్పందించారని విద్యార్థి సంఘం నాయకుడు బెజ్జంకి డిగంబర్ తెలిపారు.

మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించిన వెంటనే సాధ్యమైనంత త్వరగా చైర్మన్, వైస్ చైర్మన్  ముస్కుల సయేందర్ రెడ్డి స్పందిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మూల సరోజన, పార్టీ సీనియర్ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, పెంటరి రాజు,నూకల కమల్ ఎరుకల స్రవంతి రమేష్, ఎల్లంకి వంశీ, జంబోజు శ్రీమతి సమ్మయ్య, మారుపాక నిహారిక నాగరాజ, వేముల లక్ష్మీ, శ్రీనివాస్, పాపారావు, గోవిందుల రమేష్, సరిత సుగుణ, రజిత, రేణుక నరసమ్మ, స్రవంతి, ఈశ్వరయ్య, సంతోష్, అమర్నాథ్, కనకరాజు, ప్రసాద్, బాలరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.