21 August, 2026 | 10:02 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

సామాన్యుడికో న్యాయం? కేంద్రమంత్రికి ఇంకో న్యాయమా?

22-05-2026 01:33 PM

బండి భగీరథ్ విషయంలో.. సీఎం, కేంద్రమంత్రి కుమ్మక్కు

పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు దాచిపెట్టిందెవరో చెప్పాలి?

హైదరాబాద్: బండి భగీరథ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) కుమ్మక్కయ్యారని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిందితుడు 9 రోజులపాటు పోలీసులకు దొరకకుండా చూసింది ఎవరు?, సామాన్యుడికో న్యాయం? కేంద్ర మంత్రికి ఇంకో న్యాయమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున కేసు నమోదు చేయలేదని పోలీసులు అనడం సిగ్గుచేటు అన్నారు.

పోక్సో కేసు నిందితుడిని కాపాడేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ హైకోర్టులో బెయిల్ రావదని తేలిన తర్వాతే అదుపులోకి తీసుకున్నారని వివరించారు. అప్పగించామని.. అరెస్టు చేశామని సీఎం, కేంద్రమంత్రి కలిసి డ్రామాలు ఆడారని ఆరోపించారు. పోక్సో కేసు నిందితుడిని 9 రోజులు దాచిపెట్టిందెవరో చెప్పాలి? అని కేటీఆర్ డిమాండ్ చేశారు. "మేం పోరాడకుంటే.. బాలిక కుటుంబానికి న్యాయం జరిగేది కాదు. మా పోరాటం, న్యాయవ్యవస్థ వల్లే బాధితులకు న్యాయం జరిగింది" అని వెల్లడించారు.