30 March, 2026 | 2:20 AM

పాలీసెట్ 2026కు దరఖాస్తుల స్వీకరణ

30-03-2026 12:00 AM

పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి అరుంధతి

మేడ్చల్ అర్బన్,  మార్చి 29(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ జి అరుంధతి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలీసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని  తెలిపారు. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలు కాగా ఇతర అభ్యర్థులకు 500 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.

అదేవిధంగా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 22 2026 సంవత్సరం పరీక్ష తేదీ మే 13 2026 గా నిర్ణయించబడిందని కళాశాల ప్రిన్సిపల్ అరుంధతి స్పష్టం చేశారు.ఆసక్తిగల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని కోరబడుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.మేడ్చల్ పాలిటెక్నిక్ పాలీసెట్ దరఖాస్తుల కోసం www.polycet.sbtet.telangana .gov.in ను సందర్శించవచ్చని ఆమె చెప్పారు.ఇంకేమైనా సంప్రదింపులు చేయాలనుకున్న వారు 8019571962/ 9966366333/ 9347615836/నంబర్లకు ఫోన్ చేయవచ్చునని కళాశాల ప్రిన్సిపల్ అరుంధతి తెలియజేశారు...