మేడ్చల్‌లో అక్రమ నిర్మాణాల జోరు పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మేడ్చల్, మార్చి 29 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని బి ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జి ముల్లంగిరి శ్రీహరి చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్యాలయం పక్కనే అక్రమ నిర్మాణం జరుగుతోందని, దీనిపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేశా నని తెలిపారు.
సెలవు రోజుల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆదివారం స్లాబు వేశారని తెలిపారు. ఆదివారం స్లాబు వేస్తున్న దృశ్యాన్ని వీడియో కాల్ లో అధికారులకు చూయించానని తెలిపారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు సహకరిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుంటే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.




