వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు
- డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌లు తగ్గిస్తారన్న అపోహ వద్దు
టీయుడబ్ల్యూ జే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ
మహబూబ్ నగర్, మార్చి 6 (విజయ క్రాంతి) : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్లు అందజేయాలని టియుడబ్ల్యూ జే (ఐజెయూ)రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నా రు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో,డెస్క్ జర్నలిస్టు, ఉర్దూ మీడియా విభాగాల్లో వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అక్కడిటేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీవో 252 లో లోపాలు ఉన్న కారణంగానే యూనియన్ తరపున ముందుగానే ప్రభుత్వం, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఇప్పటికే కొన్ని సవరణలు చేసినట్లు తెలిపారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ల కేటాయింపులో కోత పెడుతున్నారని అపోహలు ఉండొద్దన్నారు. విషయాన్ని ఇప్పటికే ఐ అండ్ పి ఆర్ కమిషనర్ తో పా టు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఇటీవల డిస్కు జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు టీయూడబ్ల్యుజే తరఫున 100% మద్దతు ప్రకటించామన్నారు. జర్నలిస్టుల పక్షపాతి టియుడబ్ల్యూ జే గత ఆరున్నర దశాబ్దాలకు పైగా జర్నలిస్టుల పక్షపాతిగా వ్యవహరిస్తుందని, ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి కొమ్ముకాయదని విరాహత్ అలీ స్పష్టం చేశారు. మండల విలేకరులకు అక్రెడేటేషన్ కార్డు అందేలా కృషి చేసిన యూనియన్ టీయూబ్ల్యూజె అని గుర్తు చేశారు.
రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్క సభ్యుడు కృషి చేయాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అక్రెడిటేషన్ విషయంలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ తమ యూనియన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం మహబూబ్నగర్ ప్రె స్ క్లబ్ నుంచి డెస్క్ జర్నలిస్టుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ కు వినతి పత్రాలు అందజేశారు.
జీవోలో సవరణలు చేయాలని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ణయ్య, యూనియన్ మ హబూబ్నగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాటం నాగరాజుగౌడ్, ఎన్ సతీష్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ అహ్మద్ పాషా, జిల్లా కోశాధికారి జిల్లెల రఘు పాల్గొన్నారు.




