మాదిగలకు రేవంత్‌రెడ్డి మొండిచేయి
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ
ఖైరతాబాద్, మార్చి 6(విజయక్రాంతి): రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామా జిక వర్గాలకు తీరని అన్యాయం చేశారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆరోపించా రు. మొదటి నుంచి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న దొమ్మాటి సాంబ య్య పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, చివరకు ఆయనకు మొండిచేయి చూపడం మాదిగలను వంచించడమేనని విమర్శించారు.
సో మాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో మాది గలు మునుపెన్నడూ లేనంతగా అణచివేతకు గురవుతున్నారన్నారు. సీఎం తన కుల తత్వా న్ని చాటుకుంటూ వేల సంఖ్యలో ఉద్యోగాలను మాదిగలకు దక్కకుండా చేశారని మం డిపడ్డారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు దక్కాల్సిన 11 శాతం రిజర్వేషన్ను 9 శాతానికే పరిమితం చేయడం రేవంత్ కుట్రలో భాగమేనని ఆయన దుయ్యబట్టారు.




