జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి
ఆలేరు,(విజయక్రాంతి): జర్నలిస్టులoదరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందించాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఆలేరులో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న, పెద్ద పత్రికలు అని చూడకుండా, జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం అందించేలా దృష్టి సారించాలని కోరారు.
హెల్త్ కార్డులను అందింపజేసి, మెరుగైన వైద్య సేవలను కల్పించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రతిష్టమైన చర్యలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోరుటూరు ఉపేందర్, సీనియర్ జర్నలిస్టులు ఎర్ర జాన్సన్, తోట మల్లయ్య, సందెన శంకర్, గుండు మహేందర్, ఎలగల కుమారస్వామి, దూడల సాగర్, వంగరి శివకుమార్, సిరిగిరి స్వామి, సీస సాయిరాం, గుండు మధు, మంచన మల్లేశం బోడ నరేష్, కూళ్ళ సిద్ధులు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.




