సీఎం సభకు సరైన భారీ జనం..
01-06-2026 05:47 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ క్రాస్ రోడ్ లోని రెబ్బన మండలంలోని క్రాస్ రోడ్ వద్ద నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. సోమవారం సాయంకాలం సీఎం సభకు బయలుదేరే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వాహనాల ర్యాలీని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.






