చిట్టీల పేరుతో మోసం.. నిందితుని అరెస్ట్
మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): చీట్టిల పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బులు అక్రమంగా వసూలు చేసిన కేసులో నిండితుడైన అజ్మీరా మంగీలాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీ ఐ మహేందర్ రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మంగీలాల్ తన భార్యతో కలిసి 2017 l నుండి ఓం శ్రీమన్నారాయణ చిట్ ఫండ్ ప్రై,,లి అనే పేరుతో చీట్టిల వ్యాపారం చేస్తూ అధిక లాభాల ఆశ చూపి ప్రజలను ఆకర్షించి, పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేసి ఎత్తుకున్న చిట్టీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్టు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నిందుతునిపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, మోసం చేసినట్లు ఒప్పుకొనగా, నిందితుడి వద్ద నుండి సంబంధిత పత్రాలు, రిజిస్టర్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఇలాంటి చీట్టిలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి కోరారు.




