23 May, 2026 | 6:52 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం

23-05-2026 06:19 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ఎస్సీ కాలనీకి చెందిన నల్లగట్ల ప్రశాంత్ తన బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో అతని ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎస్సీ కాలనీకి చెందిన రాగం అశోక్, ఇసంపల్లి జంపయ్యలు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో నిందితుడు రాగం అశోక్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 35 గ్రాముల బంగారు వస్తువులు, 206 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఇసంపల్లి జంపయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఊరికి వెళ్లే ముందు విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని, అలాగే ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.