23 May, 2026 | 6:47 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం

23-05-2026 05:50 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (ఎమ్మెల్యే మానకొండూరు) హైదరాబాద్ గాంధీభవన్‌లో ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుల నియామకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం, రామవరం ప్రాంతానికి చెందిన గడ్డం రాజశేఖర్ ని రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గడ్డం రాజశేఖర్  విద్యార్థి దశ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2018లో ఎన్ ఎస్ యు ఐ కొత్తగూడెం నియోజకవర్గ జనరల్ సెక్రెటరీగా సేవలందించారు. 2020లో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి జిల్లాలోనే, అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2024 యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసి, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వారి సేవలను గుర్తించి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్ష పదవి కల్పించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా  గడ్డం రాజశేఖర్  మాట్లాడుతూ, "పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువజన కాంగ్రెస్ మరియు టీపీసీసీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలను నిర్వహించాను. పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను. నా సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ(ఎమ్మెల్యే మానకొండూరు) కి హృదయపూర్వక ధన్యవాదాలు.  రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యేసుపాదం థామస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.  రాబోయే రోజుల్లో ఎస్సీల హక్కుల సాధనకు, పార్టీ బలోపేతానికి నా శక్తి మేరకు కృషి చేస్తాను" అని తెలిపారు.

ఈ అవకాశం కల్పించేందుకు సహకరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ,మల్లు భట్టి విక్రమార్క కి, రెవెన్యూ శాఖ మంత్రి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు  తోటా దేవి ప్రసన్న కి, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్  పోదెం వీరయ్య కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.