23 May, 2026 | 7:06 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి

23-05-2026 06:17 PM

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేష్ మాదిగ

చేగుంట,(విజయక్రాంతి): తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని , మేము కాస్తులోఉన్న అక్రమంగా తన పేరున ఎక్కించుకున్న రెవెన్యూ ఉద్యోగిపై  చర్యలు తీసుకోవాలని కోరుతూ... మాసాయిపేట తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన కుటుంబ సభ్యులు వివరాలకు వెళితే మాసాయిపేట మండల పరిధిలోని పోతన్ పల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య  గ్రామంలో గల సర్వే నెంబర్ 203 లో 0-25 గుంటల భూమిని 1993  కొనుగోలు చేసినాడు, అప్పటి నుండి వాళ్లు వ్యవసాయం చేస్తూ, కబ్జ్చాలో ఉన్నారు.

ఇట్టి భూమిని  రెవెన్యూ శాఖలో,మా పాలోలు అయినటువంటి  వ్యక్తి,రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న బర్రె బాబు అక్రమంగా మాకు తెలియకుండా తన పేరున రికార్డుకు నమోదు చేయించుకున్నాడని, ఈ విషయంపై విచారణ జరిపి భూమిని అక్రమంగా తన పేరుపై నమోదు చేయించుకున్న, బర్రె బాబుని  సస్పెండ్ చేసి మాకు తగున్యాయం చేయలని మాసాయిపేట తాసిల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించారు. తాసిల్దార్  జ్ఞాన జ్యోతిని వివరణ కొరగా, పోతన్ పల్లి గ్రామనికి చెందిన బర్రె సత్తయ్య భూవివాదంపై తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి,  బాధితులకు తగు న్యాయం చేస్తామని తెలియజేశారు.