12 March, 2026 | 8:40 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

12-03-2026 01:46 AM

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి, మార్చి 11(విజయక్రాంతి): హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి భవాని చంద్ర తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వివరాలలోకి వెళితే జహీరాబాద్ మండలం ఎడకులపల్లి గ్రామానికి చెందిన నిందితుడు డుబుడం రాములు అలియాస్ బిచి రాములుకు 2012 సంవత్సరంలో జహీరాబాద్ నివాసితురాలైన లక్ష్మి తో వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. మద్యానికి బానిసైన నిందితుడు తరచూ తన భార్యతో గొడవపడి ఆమెను కొట్టేవాడని తెలిపారు.

దీంతో ఆమె జహీరాబాద్లోని తన తల్లిగారింట్లో నివసించేంది. 2021 డిసెంబర్ 16న తన భార్యతో మాట్లాడాలని చెప్పి శివాలయం వద్దకు తీసుకెళ్లి గొడవపడి, అనంతరం సమీపంలోని స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి ఆమె చున్నీతో మెడకు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో రుజువైంది. ఈ కేసును విచారించిన సంగారెడ్డి జిల్లా జడ్పిజ నిందితుడిని సెక్షన్ 302 ఐపీసీ కింద దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో నెల సాధారణ కారాగార శిక్ష విధించారు.

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శైలజ, మొదటి దర్యాప్తు అధికారి కె. శ్రీకాంత్, దర్యాప్తు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రాజశేఖర్, దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేసిన టి. భూపతి, ప్రస్తుతం జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ వినయ్కుమార్, కోర్టు సిబ్బంది సి.డి.ఓ శివకుమార్, రాజశేఖర్, లైజనింగ్ అధికారి కె. సత్యనారాయణలను జిల్లా ఎస్పీ అభినందించారు.