12 March, 2026 | 10:16 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

హైడ్రేకాన్ కాన్‌క్లేవ్

12-03-2026 01:47 AM

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై చర్చ

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్స్ కన్వెన్షన్ సెంటర్, హైటెక్ సిటీ వద్ద బుధవారం హైడ్రేకాన్ 2026 హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాన్‌క్లేవ్ నిర్వహించారు. పరిశ్రమ నిపుణులు, పాలసీ మేకర్స్, డెవలపర్లు, ఆర్కిటెక్టు లు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. నారెడ్ కో తెలంగాణ, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ సహకారంతో హైబిజ్ టీవి నిర్వ హించింది.

సీనియర్ లివింగ్ కమ్యూనిటీలలో వ్యాపార అవకాశాలు, లీజర్ లివింగ్, హాస్పిటాలిటీ, మెడికల్ టూరిజం రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో వృద్ధి, వారసత్వం, సుస్థిర పాలన మధ్య సమతుల్యత వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నా రు. షీ బిలడ్స్,  షీ లీడ్స్ అనే ప్రత్యేక సెషన్‌లో యువ మహిళా నాయకులు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ముందుకు సాగుతున్నారో, భవిష్యత్తు నిర్మాణంలో వారు ఎలా కీలక పాత్ర పోషిస్తున్నారో చర్చించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై చర్చించారు.

రియల్ ఎస్టేట్ రంగంలో ఆధునిక సాంకేతికతల వినియోగంపై ప్రదర్శన జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,  డిజిటల్ టెక్నాలజీలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా ప్రభావి తం చేస్తున్నాయో నిపుణులు వివరించారు. శ్రీధర్‌రెడ్డి (జనరల్ సెక్రటరీ నారెడ్ కో), సత్యనారాయణ (ఈడీ టెక్నికల్, మూసీ రివర్ ఫ్రంట్ ఎంఆర్‌డీసీఎల్), అశోక్ రెడ్డి (ఎండీ, హెచ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ), విజయ్ సాయి మేక (ప్రెసిడెంట్, నారెడ్‌కో తెలంగాణ), సురేష్ కొచ్చతిల్ (సీనియర్ జర్నలిస్టు) పాల్గొన్నారు.