అత్యాచారం కేసులో నిందితుడికి 20 వేల జరిమాన
20-07-2026 06:14 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని పుణ్యా నాయక్ తాండ గ్రామానికి చెందిన సోలంకి సుందర్ సింగ్ అనే వ్యక్తి 2024 సంవత్సరంలో అప్పటి ఎస్సై ప్రవీణ్ బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలంలో బాధితురాలు పనిచేస్తుండగా ఆమెపై లైంగిక దాడి పాల్పడ్డాడ నీ బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఎనిమిది మంది సాక్షులను కోర్టులో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీం సమర్థవంతంగా వాదన వినిపించి నేరాన్ని రుజువు చేశారు. దీంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు నిందితుడికి 20,000 జరిమానానికి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన కోర్టు డ్యూటీ అధికారి కోర్టు లైసన్ అధికారులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు






