21 May, 2026 | 2:41 AM

గంజాయి విక్రయిస్తున్న నిందితుడు అరెస్ట్

21-05-2026 01:08 AM

నిర్మల్ మే 20 ( విజయక్రాంతి)ఖానాపూర్ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితుని పట్టుకొని అరెస్టు చేసినట్లు నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన వివరాలను వెల్లడించారు.ఖానాపూర్ మండలం రామరెడ్డిపల్లి బస్ స్టాప్ సమీపంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి,బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ పాస్వాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.నిందితుడి వద్ద నుండి ఒక కిలో (లక్ష రూపాయల విలువ) గల గంజాయి,ఒక రియల్మీ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

విచారణలో నిందితుడు బీహార్ రాష్ట్రం నుండి గంజాయి తీసుకువచ్చి ఖానాపూర్ ప్రాంతంలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.ఈ దాడిని, స్వాధీనం,విచారణ ప్రక్రియ మొత్తం కూడా ఈ-సాక్ష్య యాప్ ద్వారా వీడియో చిత్రీకరణ చేయడం జరిగింది.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.మాదకద్రవ్యాల వ్యాపారం, సరఫరా,గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఈ కేసును విజయవంతంగా ఛేదించిన నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ సీఐ అజయ్, ఎస్‌ఐ రాహుల్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు