11 July, 2026 | 8:51 PM

Breaking News

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల 16వ స్నాతకోత్సవం   •   జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •  

ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటం గర్వకారణం

11-07-2026 07:50 PM

- శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ 

నస్పూర్,(విజయక్రాంతి): మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఎంపిక ప్రక్రియలో అత్యుత్తమ ర్యాంకుల ద్వారా ఆర్కే న్యూటెక్, RK 6 గనులు జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థకు శ్రీరాంపూర్ ఏరియాకు గుర్తింపు తీసుకువచ్చాయనీ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మినిస్ట్రీ ఆఫ్ కోల్ ప్రతీ యేటా నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపిక ప్రక్రియ 2024 - 2025 ఫలితాలను ఇటీవల విడుదల చేయగా మొత్తం 382 ప్రభుత్వ, ప్రైవేట్ భూగర్భ, ఉపరితల గనులు పోటీ పడ్డాయన్నారు. ఇందులో 50 గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ పొందగా సింగరేణిలో 5 గనులు ఈ ఘనత సాధించాయనీ, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్, RK 6 భూగర్భగనులు, బెల్లంపల్లి ఏరియాలో ఖైరిగూడ ఓపెన్ కాస్ట్, సత్తుపల్లిలో జేవిఆర్ ఓసీ 2, రామగుండం 3 ఏరియాలో ఆర్జీ ఓసీ 1 గనులు ఈ గౌరవం పొందాయన్నారు. ఇందులో శ్రీరాంపూర్ ఏరియాలో  రెండు భూగర్భ గనులు ఈ ఘనత సాధించటం సంతోషకరమన్నారు.

ఐదు గనులకు ఫైవ్ స్టార్...

సింగరేణిలో ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించగా అందులో రెండు భూగర్భ గనులు శ్రీరాంపూర్ ఏరియా నుంచే కావటం గర్వకారణం అని జీఎం శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా ఆర్కే న్యూటెక్ గని ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటమే కాదు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించన 50 గనుల్లో మొదటి స్థానంతో సింగరేణికే తలమానికంగా నిలిచిందన్నారు. అటు ఆర్కే 6 భూగర్భ గని సైతం ఈ ఘనత సాధించటం అభినందనీయం అని అందుకు కృషిచేసిన అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే న్యూటెక్ ప్రతీ యేటా అద్బత ప్రదర్శన కనబరుస్తోందన్నారు.

2023 - 2024 సంవత్సరంలో ఇదే గని జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలవగా ఈసారి 7 విభాగాలలో 50కిపైగా అంశాలలో గనుల ప్రతిభలో నిర్వహించిన పరీక్షలో ఏకంగా 99 మార్కులతో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి, ఈసీ అనుమతులకు లోబడి పర్యావరణ పరిరక్షణ చర్యలు, బొగ్గు ఉత్పత్తిలో అనుసరిస్తున్న అధునాతన సాంకేతిక విధానాలు, ఉద్యోగులు, సమీప ప్రాంతాలలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలు కొలమానంగా జరిగిన పరిశీలన అనంతరం ఈ రేటింగ్ పొందటం సంతోషకరం అన్నారు. ఈ ఐదు గనులతో పాటు సింగరేణిలో మరో 17 గనులు ఫోర్ స్టార్ రేటింగ్ సాధించాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు డీజీఎం(పర్సనల్ ) ఎస్ . అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.