11 July, 2026 | 8:20 PM

Breaking News

పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం   •   బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   ఎస్‌ఐఆర్–2026ను పారదర్శకంగా నిర్వహించాలి   •   ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటం గర్వకారణం   •  

రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ

11-07-2026 07:19 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పీఎంశ్రీ ) లో రాష్ట్రీయ లోక్.దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నోట్‌ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బాబు క్యాంప్  ప్రభుత్వ ఉన్నత  పాఠశాల (పీఎంశ్రీ ) లో నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రీయ లోక్ దళ్ స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులు  పృధ్వి నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.