11 July, 2026 | 8:40 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ఎస్‌ఐఆర్–2026ను పారదర్శకంగా నిర్వహించాలి

11-07-2026 07:53 PM

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని కాసిపేట మండలం దేవాపూర్ లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను మండల తహసిల్దార్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని, ఈనెల 24వ తేదీ వరకు పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పని చేయాలన్నారు. ఓటరు జాబితాలో నమోదు చేసే దిశగా ఇంటింటా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

గ్రామంలోని 4 వార్డులను సందర్శించి ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల పూరింపు ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు చేయాలనికోరారు. ఫారాల పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలలో మరింత విశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను మండల విద్యాధికారితో కలిసి సందర్శించి రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యాభ్యాసం, వసతి, భోజనం, త్రాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత, మెనూ అమలు తీరును పరిశీలించారు.

తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించి తరగతి గదులు, గ్రంథాలయం, పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులలో అభ్యాస నైపుణ్యాలు పెంపొందేలా నాణ్యమైన బోధన అందించాలని, గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించి విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.

అనంతరం బెల్లంపల్లి మండలం రవీంద్ర నగర్, బూదఖుర్డ్ గ్రామపంచాయతీలలోని కాశిరెడ్డిపల్లి లలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను మండల తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 24వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి స్పష్టంగా నమోదు చేయాలని, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా సృష్టి సారించాలని తెలిపారు.

మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలురు, బాలికల పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల హాజరు, పరిసరాలు, భోజనశాల, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులలో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేలా విద్యా బోధన చేయాలని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.