calender_icon.png 23 July, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్యుతానందన్ సేవలు మరువలేనివి

22-07-2025 05:24:17 PM

సీఐటీయూ నాయకులు..

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రజా నాయకుడు అచ్యుతానందన్ సేవలు మరువలేనివని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్(CITU District Secretary Dumpala Ranjith Kumar) పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ హాల్ లో కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కు సీఐటీయూ అధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ కార్యదర్శి సంకె రవితో కలిసి మాట్లాడారు. కేరళ రాష్ట్రంలో 80 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఉద్యమాల సందర్భంగా అనేక అక్రమ కేసుల్లో జైల్ జీవితం గడిపిన నాయకుడని కొనియాడారు. మచ్చ లేని నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా కష్ట జీవుల కోసం పని చేశారని, అచ్యుతానందన్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, జిలానీ, రమేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.