calender_icon.png 5 July, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలసదనం పిల్లలకు ఏసీపీ భరోసా

05-07-2025 12:13:47 AM

సిద్దిపేట, జూలై 4 (విజయక్రాంతి): సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి శుక్రవారం బాలసదనాన్ని సందర్శించారు. బాలసదనంలోని పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్యం, చదువు, జీవన స్తితిగతులపై ఆరా తీశారు. పోలీస్ కమిషనర్ పంపించిన నోట్ బుక్స్, పెన్నులు, పండ్లను పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మీకు ఏవైనా అవసరాలు, సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయండని సూచించారు.

చదువే మన జీవితాన్ని మారుస్తుందని, కష్టపడి చదివితే ఉన్నతస్థాయికి చేరవచ్చని ప్రోత్సహించారు. గొప్పగొప్ప స్థానాలలో ఉన్న అనేక మంది అధికారులు కూడా బీద కుటుంబాల నుండి వచ్చారని, అలాగే మీరు కూడా లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని విద్యార్థులను ఉత్తేజపరిచారు. మొక్కను నాటినప్పుడు అది చిన్నదే కానీ పది సంవత్సరాల తర్వాత అది మహావృక్షంగా మారుతుందనీ, మీరు కూడా చిన్నతనంలో చదువుతో అభివృద్ధి చెందితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చు‘ అంటూ విద్యార్ధులకు స్పూర్తినిచ్చారు.

తమకు అవసరమైన పుస్తకాలు, పండ్లు అందజేసిన పోలీస్ కమిషనర్, పోలీస్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, విద్యాసాగర్, ప్రవీణ్ కుమార్, బాలసదనం సూపరిండెంట్ ప్రతిభ, వార్డెన్ రజిత, సిడబ్ల్యూఓ భాగ్య, వార్డు ఆఫీసర్ పూజ, పిఆర్వో మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, శిశుగృహ మేనేజర్ రాజు, సోషల్ వర్కర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.